పాకిస్థాన్ మరో కుట్రకు తెర లేపింది. అణుబాంబు ప్రయోగానికి పాక్ సిద్ధం అయింది. భారత్ కొట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ విలవిలలాడుతోంది. దీంతో భారత్‌ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారని వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో అణుబాంబుల ప్రయోగంపై నిర్ణయం తీసుకోనున్నారని అంటోంది. కాగా.. పాక్ అణుబాంబుపై పూర్తి అధికారాలు NCAకు ఉంటాయి. ఇక అటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక నిన్ఱయం తీసుకున్నారు. పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లను సందర్శించిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. వాళ్లకు భరోసా కల్పిస్తున్నారు. కాగా జమ్మూలోని ఆప్ శంభు ఆలయం పై పాక్ మిస్సైల్ తో దాడి చేసినట్టు దేవాలయం వెలుపల ఉన్న భవనం ధ్వంసం అయినట్టు సమాచారం. పాక్ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.