ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతోంది. అయితే, ఈ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య వార్ నేపథ్యంలో ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేసింది కేంద్రం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బద్రినాత్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు పాకిస్థాన్ మరో కుట్రకు తెర లేపింది. అణుబాంబు ప్రయోగానికి పాక్ సిద్ధం అయింది. భారత్ కొట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ విలవిలలాడుతోంది. దీంతో భారత్‌ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారని వార్తలు వస్తున్నాయి.