16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ.. దేశ భద్రతకు ముప్పు ?

-

ఢిల్లీ, ముంబై, నాగపూర్ నుంచి ఆపరేషన్ చేస్తూ ఆర్మీతో సహా 140 రంగాల్లో పని చేస్తున్న 16 కోట్ల 8 లక్షల మంది బ్యాంక్ అకౌంట్స్, ఆధార్, గ్యాస్, క్రెడిట్ కార్డ్స్ తో సహా వ్యక్తిగత డేటా చోరీ చేశారు కేటుగాళ్లు. సైబరాబాద్ పోలీసులు ఒక క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసు ట్రేస్ చేస్తున్న క్రమంలో పెద్ద డొంక కదిలింది, ఢిల్లీ లో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ప్రతిపక్షల మీద దాడులు చేయడం కాదు కొంచం ఇలాంటివి కూడా పట్టించుకోండి లేదా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇక దీనిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీ కి గురి అయిందని తెలిపారు. డిఫెన్స్ , ఆర్మీ ఉద్యోగుల కు చెందిన సెన్సిటివ్ డేటా ను సైతం అమ్మకానికి పెట్టారు..ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని తెలిపారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. ఈ విషయాలను తెలిపారు. ఈ డేటా చోరీ దేశ భద్రత కు ముప్పు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version