పెట్రోల్ కష్టాలు తప్పవా..? మే 31 నుంచి పెట్రోల్ కొనుగోలు చేయమంటున్న బంకులు

-

దేశంలో మరోసారి పెట్రోల్ కష్టాలు తప్పవా అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. పెట్రోల్ డీలర్ అసోసియేషన్ మే 31 నుంచి దేశ వ్యాప్తంగా ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డిజిల్ కొనుగోలు చేయం అని కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 రాష్ట్రాల్లోని 70000 అవుట్ లెట్లు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్, డిజల్ ను కొనడం బంద్ చేస్తామని ప్రకటించాయి.  దీంతో బంకుల్లో పెట్రోల్ ఉండదు. దాదాపుగా బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. 2017 నుంచి డీలర్ కమిషన్ మార్జిన్ 2 శాతంగానే ఉందని…5 ఏళ్లలో ఒక్కసారి పెంచలేదని ఫలితంగా డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ తెలిపింది. తమ కమీషన్ మార్జిన్ ను 5 శాతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఎక్సైజ్ టాక్సును తగ్గించడంతో డీలర్లకు నష్టాలు వచ్చాయని అన్నారు. ఎక్కువ ధరకు పెట్రోల్ కొని తక్కువ ధరకు విక్రయించడంతో లక్షల్లో నష్టాలు ఎదురయ్యాని ఆవేధన వ్యక్తం చేశారు. సిబ్బంది జీతాలు, మెయింటనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఫలితంగా డీలర్ మార్జిన్ పెంచాలి డీలర్లు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version