కేటీఆర్ ఢిల్లీ టూర్ పై బిజేపీ వరుస పంచ్ డైలాగులు పేలుస్తుంది.. అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయని.. కేంద్రమంత్రికి పిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్న చెప్పిన కేటీఆర్.. విమానం ఎక్కేశారు.. మనోహర్ ఖట్టర్ కు పిర్యాదు చేశామని.. భవిష్యత్ లో రాష్ట ప్రభుత్వ అవినీతిపై పిర్యాదులు చేస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు.. దీనిపై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది.. ఏ కేంద్రమంత్రిని కలిశారో ఫోటో అయినా చూపెట్టాంటూ సవాల్ చేసింది..
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఢిల్లీ టూర్ రగడ జరుగుతున్న నేపథ్యంలో.. కమలం పార్టీ నేతలు ఎంటర్ అయ్యారు.. కేటీఆర్ వెళ్లింది కేంద్రమంత్రిని కలవడానికి కాదని.. కాంగ్రెస్ పెద్దలను కలిసి.. శరణుకోరేందుకంటూ బాంబ్ పేల్చింది. దీంతో కాంగ్రెస్ కాస్త వెనకడుగు వేసింది.. ఇదే ఊపులో బిజేపీ టార్గెట్ కేటీఆర్ అన్నట్లుగా సవాళ్ల మీద సవాళ్లు విసిరింది..
అమృత్ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి తనకు బంధువులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే బిజేపీతో పాటు.. బీఆర్ఎస్ కూడా ఆరోపించాయి.. ఈ వ్యవహారంలో మైలేజ్ పొందేందుకు కేటీఆర్ డిల్లీ వెళ్లారు.. కేంద్రమంత్రిని కలిశానని, పిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు.. అయితే బిజేపీ నేతలు మాత్రం ఈ ఇష్యూని మరో యాంగిల్ లో జనాల్లోకి తీసుకెళ్లారు..
కేటీఆర్ డిల్లీ వెళ్లిన సబ్జెక్ట్ వేరని.. అమృత్ టెండర్ల అవకతవకలపై తాము ఇప్పటికే కేంద్రమంత్రులకు పిర్యాదు చేశామని తెలంగాణ కమలం నేతలు చెబుతున్నారు. కేటీఆర్ ఎవరిని కలిసారో ఆధారాలు చూపాలంటూ సవాల్ చేస్తుండటంతో డిల్లీ టూర్ పై పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. కేటీఆర్కు కేంద్రమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. కానీ కేంద్రమంత్రిని కలిసి పిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్పుకుంటున్నారని కాషాయం నేతలు మండిపడుతున్నారు..
కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపద్యంలో దాని నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ డిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారని బిజేపీ నేతలు మరో బాంబ్ పేల్చారు.. కాంగ్రెస్, బిజేపీ నేతల విమర్శలను విన్న బీఆర్ఎస్ నేతలు అస్సలు కేటీఆర్ డిల్లీ వెళ్లారా లేదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఢిల్లీ వెళ్లి.. కేంద్రమంత్రిని కలిసుంటే.. ఒక్క పోటో అయినా చూపించాలి కదా.. అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.. మొత్తంగా కేటీఆర్ డిల్లీ టూర్ వ్యవహారం రాజకీయంగా చర్చలకు దారి తీసింది..