PM MODI: చిరంజీవి, పవన్‌తో మోదీ ఫోటో

-

చిరంజీవి, పవన్‌తో మోదీ ఫోటో దిగారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవితో.. ప్రధాని మోదీ ఫొటో దిగారు. ఈ సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. కేసరపల్లిలో నిర్వహించిన సభలో పవన్‌, లోకేశ్‌తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Photo of Modi with Chiranjeevi, Pawan

 

అటు ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబుకుప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం బాబును మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news