మైనార్టీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు : ప్రధాని మోదీ

-

మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. మైనారిటీలపై తాను విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

“రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ నిరంతరం ఉల్లంఘిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను బట్టబయలు చేయడమే నా ఎన్నికల ప్రసంగాల లక్ష్యం. మైనారిటీలకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేడ్కర్, జవహర్‌ లాల్ నెహ్రూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని విపక్షాలు ఉల్లంఘిస్తున్నాయి. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకం కాదు. మేము ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించడానికి సిద్ధంగా లేము. అందరినీ సమానంగా పరిగణిస్తాం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version