BREAKING : ఇవాళ PM రోజ్ గార్ మేళ జరుగనుంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పిఎం రోజ్ గార్ మేళ నిర్వహిస్తోంది మోడీ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71 వేల మందికి పిఎం రోజ్ గార్ మేళ లో నియామక పత్రాలు జారీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
పిఎం రోజ్ గార్ మేళలో పాల్గొననున్నారు మోడీ.
హైదరాబాద్ లో పిఎం రోజ్ గార్ మేళలో పాల్గొంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు.. కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఖాళీలు ఉన్నాయని తేలిందని వివరించారు. తెలంగాణ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయి అభ్యర్థులు రోడ్డు పై పడ్డారు.. 10 నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ను మోడీ నేరుగా చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు.