భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని

-

భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని తెలిపారు. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్న ప్రధాని.. ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని.. తయారీ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలని చెప్పారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version