ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేసింది. ఈ తరుణంలోనే హాస్పిటల్ లన్ని… చికిత్స అందించేందుకు వెనుకాడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు… తమ పెండింగ్ ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
15 రోజుల కిందటే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నీతో ఆగస్టు 15వ తేదీ అంటే ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రైవేట్.. ఆస్పత్రులు ప్రకటించాయి. 2500 కోట్ల బకాయిలు… వెంటనే విడుదల చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా కూడా స్పందించారు. ప్రస్తుతానికి అయితే 200 కోట్లు బకాయిలను విడుదల చేశామని… వెల్లడించారు. సోమవారం రోజున మిగితా 300 కోట్లను రిలీజ్ చేస్తా మని స్పష్టం చేశారు. కానీ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిగించకూడదని కోరారు. అయినప్పటికీ సమ్మెకు దిగుతున్నాయి.. ప్రైవేట్ ఆస్పత్రులు.