17వ లోక్‌సభ చివరి సమావేశంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో ఈ ఐదేళ్లు రిఫామ్, పర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్ జరిగిందని అన్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పారు. తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల అనేక కష్టాలు పడ్డామన్న మోదీ.. అనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
“పదేళ్లుగా రిఫామ్, పెర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాం. కొత్త పార్లమెంటు భవనం మనకు గర్వకారణంగా నిలిచింది. భారత సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసింది. భారత్ ఆతిథ్యం ఇచ్చిన జీ – 20 సదస్సు విజయవంతం అయ్యింది. జీ-20 సదస్సుతో మనదేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. డిజిటలైజ్ చేసి కాగిత రహిత పార్లమెంటుగా తీర్చిదిద్దాం. డిజిటలైజ్ చేసి కాగిత రహిత పార్లమెంటుగా తీర్చిదిద్దాం.” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.