PM Modi launches Amrit Bharat trains : ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దారి వెంట 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తుండగా…. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అనంతరం అయోధ్య ఎయిర్పోర్ట్ సహా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఇక అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అమృత్ భారత్’ రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా రైలులోని ప్రయాణికులతో మోదీ ముచ్చటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.