Hi Nanna Ott Relese : జనవరి 4న OTTలోకి ‘హాయ్‌ నాన్న’

-

 

Hi Nanna Ott Relese : హాయ్‌ నాన్న.. ఇటీవల నాని, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సైలెంట్‌ హిట్‌ కొట్టింది.తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది.అందుకే మూవీ రిలీజ్ అయి 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లకు జనాలు వస్తున్నారు. అంటే ఈ సినిమా ఆడియోన్స్ మనసులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Nani’s Hi Nanna locks its OTT release date

సలార్‌, డంకీ వంటి పెద్ద మూవీస్ వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న హాయ్‌ నాన్న మూవీ ఓటీటీ విడుదల గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది. నాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందు కు వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన ఈ చిత్రం జనవరి 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news