బంగ్లా హిందువులపై భారతీయులు ఆందోళనగా ఉన్నారు: ప్రధాని మోదీ

-

దిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో బంగ్లాదేశ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లా హిందువుల పరిస్థితిపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని అన్నారు. బంగ్లాదేశ్‌కు భారత్‌ ఎప్పుడూ శ్రేయోభిలాషే అని వెల్లడించారు. మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

‘ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. మన కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. నూతన నేర చట్టాల్లో శిక్షల కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువగా ఉండేలా పౌరసేవలు అందిస్తాం. ఎగుమతుల్లో పురోగతితో ప్రపంచ ప్రగతిలో భారత్‌ పాత్ర పెరిగింది. జీవన సౌలభ్యమే లక్ష్యంగా ప్రభుత్వ సేవలు అందాలి. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం.’ అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news