అవిశ్వాస తీర్మానంపై ఇవాళ సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ

-

మణిపుర్‌ అంశం పార్లమెంటు సమావేశాలను కుదిపేస్తోంది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని మొదటి రోజు నుంచి పట్టుబడుతున్న విపక్షాలు.. ఏకంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మణిపుర్ హింసపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ సమాధానం ఇవ్వనున్నారు.

ప్రధాని ఇవాళ పార్లమెంటుకు వచ్చి తీర్మానంపై మాట్లాడతారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల చివరిరోజైన ఆగస్టు 11న ఈ అంశంపై ప్రధాని మాట్లాడతారని వివరణ ఇవ్వగా.. అందుకు విపక్షాలు ఒప్పుకోలేదు. తొలిరోజు నుంచే ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. బుధవారం రోజున పార్లమెంటులో ప్రసంగించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. మోదీ ఇంకా మణిపుర్‌లో ఎందుకు పర్యటించలేదనీ.. ఆ రాష్ట్రాన్ని భారత్‌లో భాగంగా ప్రధాని గుర్తించట్లేదనీ.. ధ్వజమెత్తారు. సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. మణిపుర్ హింసాకాండ పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version