భారత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విదేశీ పర్యటను సిద్ధమవుతున్నారు. ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై చర్చలు జరిపారు. భారత్ అశాంతికి ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వదని, కేవలం శాంతి మార్గంలో యుద్ధ విరమణ కోసం చర్చలు జరపాలని జెలెన్ స్కీకి ప్రధాని మోడీ స్పష్టంచేశారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మరోసారి మోడీ నొక్కిచెప్పారు.
తాజాగా సెప్టెంబర్ తొలివారంలో ప్రధాని మోడీ బ్రూనై, సింగపూర్లో పర్యటించనున్నారు. 3,4వ తేదీల్లో బ్రూనైలో, 4,5వ తేదీల్లో సింగపూర్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల కోసం బ్రూనై వెళ్లడం ప్రధాని మోడీకి ఇదే తొలిసారి. ఇండియా, బ్రూనై మధ్యలో బంధం ఏర్పడి 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని ఆ దేశ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ప్రపంచ సమస్యలపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భారత పీఎం మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.