గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​తో మోదీ వర్చువల్ భేటీ.. ఏం చర్చించారంటే..?

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌తో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూదిల్లీలో భారత్ నిర్వహించనున్న ఏఐ సమ్మిట్‌లో.. గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ భేటీలో ఆయన సుందర్ పిచాయ్​తో.. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగూల్ ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ -GIFTలో గూగుల్ తన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రధాని స్వాగతించినట్లు తెలిసింది.

అటు జీ-పే, UPI బలాన్ని, రీచ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌లో ఆర్థిక చేరికలను మెరుగుపరచడానికి గూగుల్ ప్రణాళికల గురించి ప్రధానికి పిచాయ్ తెలిపినట్లు సమాచారం. భారత్‌ అభివృద్ధి పథంలో వెళ్లేందుకు గూగుల్ నిబద్ధత గురించి పిచాయ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. వర్చువల్ సమావేశం అనంతరం.. దేశంలో క్రోమ్‌ బుక్‌లను తయారు చేయడంలో HPతో గూగుల్ భాగస్వామ్యాన్ని మోదీ అభినందించారని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. గూగుల్ 100 భాషల చొరవను గుర్తించిన ప్రధాని.. భారత భాషలలో ఏఐ సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version