BREAKING : ఈనాడు రామోజీరావుపై మరో కేసు నమోదు !

-

BREAKING : ఈనాడు రామోజీరావుపై మరో కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. రామోజీరావు, శైలజ కిరణ్‌లపై మరో కేసు నమోదు అయిందట. 420, 467, 120బి, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం రామోజీరావు, శైలజ కిరణ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది.

ఈ సీఐడీకి మార్గదర్శి వ్యవస్థాపకుడు జగన్నాథ రెడ్డి కుమారుడు యూరీరెడ్డి ఫిర్యాదు చేశారని సమాచారం. మార్గదర్శిలో తన పేరు మీద ఉన్న షేర్లను ఫోర్జరీ సంతకాలతో శైలజా కిరణ్ పేరు పై బదలాయించారని ఫిర్యాదు చేశారు యూరీ రెడ్డి. ఈ తరుణంలోనే.. రామోజీరావు, శైలజ కిరణ్‌లపై మరో కేసు నమోదు అయిందట.

ఇది ఇలా ఉండగా, రెండో రోజు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు కిలారి రాజేష్. ఏపీ స్కిల్ కుంభకోణంలో కిలారి రాజేష్ పాత్ర పై అభియోగాలు ఉన్నాయి. కిలారి ద్వారానే నగదు నారా లోకేష్ కు చేరిందనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగానే… నిన్న ఆరు గంటల పాటు రాజేష్ ను ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. ఇవాళ మళ్లీ రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో రెండో రోజు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు కిలారి రాజేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version