నేడే తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ప్రధాని మోదీ ట్వీట్

-

అంతరిక్ష రంగంలో సగర్వంగా సరికొత్త చరిత్ర లిఖించి నేటితో సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది భారతదేశం. అమెరికా, రష్యా, చైనాలకు కూడా సాధ్యం కాని ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జాబిల్లి దక్షిణధ్రువంపై చంద్రయాన్-3ను విజయవంతంగా దింపి ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యపడని ఘనతను మూట గట్టుకుంది.

ఇస్రో పంపిన ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రగ్యాన్‌లు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజే జాబిల్లిపై అడుగుపెట్టాయి. ఆ శుభ దినాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది “టచింగ్‌ లైవ్స్‌ వైల్‌ టచింగ్‌ మూన్‌ ఇండియాస్‌ స్పేస్‌” సాగా నేపథ్యంతో నేషనల్‌ స్పేస్‌ డేను జరుపుకుంటున్నాం.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా ఈ రోజు గుర్తుచేసుకుంటున్నామని తెలిపారు. మన శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించే రోజు కూడా ఇదేనని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version