PMantri Fasal Bima Yojana: భారతదేశంలోని రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ రైతుల ఖాతాలలో డబ్బులు వేయనుంది మోడీ సర్కార్. ఇవాళ 30 లక్షల మంది రైతులకు ఖాతాలలో పీఎం ఫసల్ బీమా యోజన కింద 3200 కోట్లు జమ కాబోతున్నాయి.

రాజస్థాన్ జంజును లో జరిగే కార్యక్రమంలో ఆ నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేరుగా రైతుల ఖాతాలలో.. జమ చేయనున్నారు. ఈ పథకం కింద అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రైతులు లబ్ధి పొందనున్నారు. మధ్యప్రదేశ్ రైతులకు ఏకంగా 1156 కోట్లు అలాగే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు 1121 కోట్లు దక్కనున్నాయి. చత్తీస్గడ్ రాష్ట్రానికి 150 కోట్లు దక్కనున్నాయి. మిగిలిన రాష్ట్రాలకు 773 కోట్లు రిలీజ్ చేయనుంది మోడీ ప్రభుత్వం.