దిల్లీలోని ‘న్యూస్‌క్లిక్‌’ ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు

-

ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవల వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు మళ్లీ.. న్యూస్‌క్లిక్‌ ఆఫీసు, ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. ఇవాళ ఉదయం దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ విభాగం అధికారులు.. న్యూస్‌క్లిక్‌ కార్యాలయంతో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. దాదాపు 30 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాలపై ఓ సీనియర్‌ జర్నలిస్టు స్పందించారు. తన సోషల్‌మీడియాలో ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘నా ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని పోస్టులో వెల్లడించారు.

న్యూస్‌ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్’ వంటి అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అమెరికా మిలియనీర్‌ నెవిల్లే రాయ్‌ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్‌.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని ఆ కథనాలు వెల్లడించడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దీనిపై కేసు నమోదు చేసి.. ‘న్యూస్‌క్లిక్‌’ ఆఫీసులో సోదాలు నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version