ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో నెక్స్ట్ ఎవరు గెలుస్తారనే అంశంపై సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. మెజారిటీ సర్వేలు వైసీపీ మళ్ళీ గెలుస్తుందని చెబుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సంస్థ సైతం వైసీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుస్తుందని, టిడిపి 0-1 సీటు గెలుస్తుందని చెప్పింది. ఇక ఇందులో రియాలిటీ ఎలా ఉన్నా…వైసీపీ స్వీప్ చేయబోతుందని చెబుతుంది. అదే సమయంలో ఆత్మసాక్షి సర్వే ఒకటి బయటకొచ్చింది.
గతంలో పలుమార్లు ఆత్మసాక్షి సంస్థ సర్వేలు నిర్వహించింది. అందులో టిడిపికి మెజారిటీ సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ సంస్థ సర్వే ఒకటి విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు చేసిన సర్వే నాలుగు రకాలుగా చేసింది. అందులో మొదట ప్రతి పార్టీ పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తే..175 సీట్లకు టిడిపి-86, వైసీపీ-68, జనసేన-6 సీట్లు గెలుచుకుంటుందని, టఫ్ ఫైట్ 15 సీట్లు అని…అందులో వైసీపీ 9, టిడిపి 6 సీట్లలో ఆధిక్యంలో ఉందని చెప్పింది.
ఇక టిడిపి-జనసేన పొత్తు ఉంటే..పొత్తులో టిడిపి-95, జనసేన-13, వైసీపీ-60, టఫ్ ఫైట్ -7 సీట్లలో ఉంటుందని..అందులో టిడిపి 5, వైసీపీ 2 సీట్లలో లీడ్ లో ఉందని చెప్పింది. మూడో సర్వే..టిడిపి-జనసేన-బిజేపి కలిసి పోటీ చేస్తే..మూడు పార్టీలకు కలిపి 70-75 సీట్లు వస్తాయని, వైసీపీ 98-100 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది. టఫ్ ఫైట్ 7 సీట్లలో ఉందని తేల్చింది.
నాల్గవ సర్వే వచ్చి..టిడిపి-జనసేన-కమ్యూనిస్టులు కలిసి 115-122 సీట్లు, వైసీపీ-56-68 , టఫ్ ఫైట్ 4 సీట్లలో ఉంటుందని చెప్పింది. అంటే ఇక్కడ బిజేపితో పొత్తు ఉంటే టిడిపి-జనసేనకు ఓటమి, వైసీపీకి గెలుపు ఖాయం. కమ్యూనిస్టులతో కలిస్తే మాత్రం రిజల్ట్ మారిపోతుంది. మరి 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.