ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ లో నేడు పోలింగ్

-

ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరును భాగస్వామిని చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. అందుకోసం మారుమూల గ్రామాల నుంచి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ లోనూ నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ బూత్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది.

హిమాలయ కొండల్లో సుమారు 15,256 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న గ్రామం తాషిగంగ్. ఇది భారత్- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంది. ఇక్కడి పోలింగ్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపుపొందింది. మండి నియోజకవర్గం, స్పితి లోయ ప్రాంతం ప్రజలు ఇక్కడ ఓటు వేస్తున్నారు. నేటి ఉదయం హిమాలయాల్లోని ఒడిదుడుకులను దాటుకుని పోలింగ్ సిబ్బంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
పోలింగ్ బూతు అందంగా ముస్తాబు చేసి ఓటర్లకు స్వాగతం అని రాసిఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నాలుగోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version