దేశంలో బొగ్గు కొరత తీవ్రమవుతోంది. పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో కేంద్రం సంక్షోభాన్ని పరిష్కరించే పనిలో ఉంది. రాష్ట్రాల విద్యుత్ అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 7150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ కొరత, ఒత్తడి ఎదుర్కొంటున్న పవర్ ప్లాంట్లు, ఒప్పందాలపై గురించి చర్చించనున్నారు.
బొగ్గు సంక్షోభం, విద్యుత్ కొరతపై రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
-