తెలంగాణలో అధికారం మాదే – రాహుల్ గాంధీ

-

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజస్థాన్, చత్తీస్గడ్ లోను తిరిగి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఈసారి సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని అన్నారు రాహుల్ గాంధీ.

అలాగే రాజస్థాన్ లో కూడా గెలవబోతున్నామన్నారు. దేశంలో కొందరి వద్ద మాత్రమే డబ్బు పొగైపోయిందని విమర్శించారు. 2024 ఎన్నికలలో బిజెపికి ఆశ్చర్యపోయే ఫలితాలు రావడం ఖాయమన్నారు. కర్ణాటక ఎన్నికలలో తాము ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నామన్నారు రాహుల్ గాంధీ. బిజెపి మీడియా దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుందన్నారు. భారత్ జోడోయాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిజెపి కోట్ల రూపాయలను వెచ్చించిందని ఆరోపించారు. కానీ అది విఫలమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version