భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించారు. భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తెలిపిన విషయం తెలిసిందే.

కాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో జరిగింది? అని నిలదీశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.