గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందజేసింది. గిగ్ వర్కర్ల కోసం త్వరలోనే ప్రత్యేకమైన పాలసీని తీసుకు వస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీరికి చట్టబద్ధమైన గుర్తింపు కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుతోపాటు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రస్తావించారు.

గిగ్ వర్కర్ల కోసం సంబంధించిన పూర్తి సమాచారం వెబ్ సైట్ లో ఉండేలా చూడాలని అన్నారు. ప్రమాద – ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించేలా కొత్త పాలసీ ఉండాలని సూచనలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గిగ్ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొందర్లోనే ఈ పాలసీని అమలులోకి తీసుకురావాలని కోరుతున్నారు.