సింహాచలం ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ…ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించబోతున్నట్లు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ.

క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అటు సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయశాఖలో ఔటసోర్సింగ్ ఉద్యోగ అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది