దేశంలోని భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి చార్ దమ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో గంగోత్రి అలాగే యమునోత్రి అనే రెండు ఆలయ ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. మే రెండవ తేదీన కేదార్నాథ్ అలాగే మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు.

నాలుగు ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్… చేసే ప్రయాణాన్ని చార్ ధమ్ యాత్ర అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే ఇవాల్టి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.