కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సహాయక చర్యలు, ట్రాక్ పనులపై ఆరా తీసిన ప్రధాని మోడీ.. ట్రాక్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి సూచనలు చేశారు. కాగా, సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ ప్రమాదం అని పేర్కొన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈ ప్రమాదం అని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టంలో మార్పులు చేశారు.. ఆ మార్పుల వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కవచ్ లేకపోవడం ప్రమాదాని కి కారణం కాదు.. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేసిన వారిని గుర్తించామని ప్రకటన చేశారు. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయన్నారు. సిగ్నలింగ్‌లో జరిగిన ట్యాంపరింగ్‌పై నివేదిక సిద్ధమైందని వెల్లడించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.