ప్రత్యేక హోదా కోసం పలుసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కలిశారని, ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని అన్నారు రఘురామ. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అని నినదించిన జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనప్పటికీ, తన బాబాయి వై.యస్. భాస్కర్ రెడ్డి గారిని ప్రత్యేక హోదా ఖైదీగా గుర్తించే విధంగా ఢిల్లీ పెద్దలను ఒప్పించగలిగారని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
భీమవరం నుంచి మళ్లీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని కోరాల్సిందిగా వారికి సూచించానని, అప్పటికి తాను ఈ పార్టీలో ఉండనని, మంచి మనిషిని ఓడించామనే బాధ ప్రజల్లో ఉందని, ఆయన్ని ఈసారి 60 వేల పైచిలుకు మెజారిటీతోనే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం పోరాడుతూ, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించి, ప్రజలను కష్టాలనుంచి కాపాడాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని గత ఎన్నికల్లో ఓడించిన దానికి పాప ప్రక్షాళన చేసుకునేందుకు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.