మన ఇండియా రాజధాని ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం వచ్చింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలోనే… రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు అయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
అటు భూప్రకంపనలు పై “X” వేదిక ద్వరా ప్రధాని మోడీ స్పందించారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయని తెలిపారు. ఆందోళన చెందకుండా, తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని వివరించారు. మరలా భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారన్నారు మోడీ.