భారత ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు పర్యటన ఖరారైంది. ఇవాళ ఉదయమే బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. బెంగళూరు మెట్రో రైలు ఎల్లో లైన్ అలాగే వందే భారత్ రైళ్లను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన బెంగళూరులో కొనసాగనుంది.

ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటల సమయంలో బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారని చెబుతున్నారు. హెలికాప్టర్ అలాగే రోడ్డు మార్గంలో కె ఎస్ ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్ కు ప్రధాని నరేంద్ర మోడీ మొదట వెళ్తారు. ఈ సందర్భంగా అక్కడ కె ఎస్ ఆర్ బెంగళూరు – బెలగావి మధ్య వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఆర్.వి రోడ్డు దగ్గరి మెట్రో రైల్ ఎల్లో లైన్ ప్రారంభిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారు.