మహేశ్-రాజమౌళి మూవీ.. ఫ్యాన్‌మేడ్ పోస్టర్ వచ్చేసింది !

-

SSMB 29 వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. అమెజాన్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడం, అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

mahesh babu ssmb 29
mahesh babu ssmb 29

అయితే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. మెడలో త్రిశూలం తో ఉన్న పోస్టర్ను రాజమౌళి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు ఫోటో కనిపించకుండా చేశారు. కేవలం మెడలో ఉన్న దండను మాత్రమే చూపించారు. అయితే ఓ అభిమాని ఈ పోస్టర్ కు ఏఐ టెక్నాలజీ జోడించి మహేష్ బాబు లుక్ తయారు చేశాడు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news