తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగతేమో కానీ అప్పటినుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు ఏదుర్కొంటున్నారు.చివరికి విలువ లేని కామెంట్లు కూడా వినాల్సివస్తోంది. అసలు చంద్రబాబుతో పెట్టుకుంటే ఏ మేరకు దిగజారాల్సి వచ్చిందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది ఆ పార్టీ కేడర్ కు. కరివేపాకులా వాడేసుకుంటున్నారని ఆవేదనకు గురవుతున్నారు జనసైనికులు.పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనేసరికి ఆందోళనలో మునిగిపోయారు జనసేన అభిమానులు.పార్టీ స్థాపించి 10 ఏళ్లు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదని అంటున్నారు జనసేన నాయకులు.
ఇప్పుడు వాళ్ళు అంతగా ఎందుకు ఫీల్ కావాల్సివచ్చిందంటే… టీడీపీ జనసేన కూటమి గెలిస్తే ఐదేళ్ళ పాటు సీఎం గా చంద్రబాబే ఉంటారని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో జనసైనికులు రగిలిపోతున్నారు.కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడుకుని వదిలేస్తే ఎన్నాళ్ళు ఈ మోసం అని పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ పొత్తు పెట్టుకున్నపుడు రెండు పార్టీల చర్చల తర్వాతనే ఏదైనా నిర్ణయం ప్రకటించాలి. ఏకపక్షంగా సీఎం చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు లోలోపల మదనపడిపోతున్నారు.
చంద్రబాబును జైల్లో ఉన్నపుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను ప్రకటించి పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇపుడు లోకేష్ ఇలా ప్రకటన చేయడమేమిటని జనసైనికులు మండిపడుతున్నారు. అటు కేంద్రంలో బీజేపితో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్దపడితే ఇపుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన క్యాడర్ అసహనానికి గురవుతున్నారు.ప్యాకేజ్ తీసుకుంటున్నారని, జనసేనను టీడీపీ దగ్గర తాకట్టుపెట్టారనే ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
అసలు మనపార్టీకి కూడా చంద్రబాబే సీట్లు కేటాయిస్తాడా ?
అయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుని కిమ్మనకుండా ఉండాలా ? ఇలా ఎవరికి వారు ప్రశ్నించుకుని టీడీపీ వైఖరిని ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెనుక వెళ్ళి 2014 లో ఒకసారి దెబ్బతిన్నాం. 2019 లో పరోక్షంగా చంద్రబాబు దెబ్బతీశాడు. కనీసం గతంలో ఇచ్చిన మద్దతునైనా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు చేశాడు. మళ్ళీ ఇపుడు మరోసారి మోసపోవడానికి సిద్ధపడుతున్నాడు అధినేత అని ఆలోచనలో పడ్డారు జనసైనికులు.
మోసం చేసేవాడిది తప్పు కాదు మోసపోవడం తప్పు అన్న సంగతి అన్ని పుస్తకాలు చదివిన తమ అధినేతకు తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా చివరాకరుకు జనసేనను టీడీపీలో మెర్జ్ చేస్తారా అనే అనుమానాలు కూడా పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతున్నాయి. ఇపుడే తమ దారి తాము చూసుకుంటే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు జనసైనికులు. ఏదైనా వచ్చే ఎన్నికల్లో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ అధినేత గాని, అధినాయకత్వం గాని నోరుమెదపకపోవడడంతో జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు మరింత అనుమానాలకు తావిస్తోంది.ఇకనైనా మేలుకుంటే జనాభాకు కొంత దగ్గరైనట్టు ఉంటుందని అనుకుంటున్నారు.