పుణె హిట్ అండ్ రన్ కేసు.. ప్రమాదానికి ముందు బార్‌లో 48వేలు ఖర్చు చేసి..

-

మహారాష్ట్రలోని పుణెలో మైనర్ బాలుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదటగా వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేలు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా ఫూటుగా మందు తాగినట్లు వెల్లడించారు

ఇక మద్యం మత్తులోనే తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ టీనేజర్‌కు డ్రైవింగ్‌ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వివేక్ భిమన్వార్‌ వెల్లడించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version