IPL 2023 : ముంబైపై పంజా విసిరిన పంజాబ్

-

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ ను విజయం వరించింది. రోహిత్ శర్మ (44), కెమెరూన్ గ్రీన్ (67), సూర్య కుమార్ యాదవ్ (57) పోరాటం వృధా అయ్యింది. అయితే తోలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రతిష్టమైన స్కోర్ చేయడంతో పాటు… బౌలింగ్ విభాగంలోనూ మంచి ఆట తీరు కనబరిచింది.

దీంతో నిర్ణీత ఓవర్లలో ముంబైని కట్టడి చేసి ఆరు వికెట్లను పడగొట్టింది. అయితే ముంబై చివరి దాకా పోరాడిన ఫలితం దక్కలేదు. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 215 టార్గెట్ చేతనలో రోహిత్ సేనను 201 రన్స్ కే కట్టడి చేసింది. అర్షదీప్ సింగ్ 20వ ఓవర్లో హడలెత్తించాడు. మూడో బంతికి తిలక్ వర్మ(3)ను బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టాంప్ విరిగి అవతల పడింది. తర్వాత బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన నీహళ్ వదేరా(0) కూడా అచ్చం అలానే బౌల్డ్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version