IPl 2023 : అర్షదీప్ సింగ్ బీభత్సం..వికెట్లు విరగొట్టేశాడుగా

-

రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ ను విజయం వరించింది. రోహిత్ శర్మ (44), కెమెరూన్ గ్రీన్ (67), సూర్య కుమార్ యాదవ్ (57) పోరాటం వృధా అయ్యింది. అయితే తోలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రతిష్టమైన స్కోర్ చేయడంతో పాటు… బౌలింగ్ విభాగంలోనూ మంచి ఆట తీరు కనబరిచింది. దీంతో నిర్ణీత ఓవర్లలో ముంబైని కట్టడి చేసి ఆరు వికెట్లను పడగొట్టింది.

అయితే ముంబై చివరి దాకా పోరాడిన ఫలితం దక్కలేదు. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో హీరో అంటే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ అనే చెప్పాలి. ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఈ దశలో బౌలింగ్ కు దిగిన లెఫ్టర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ పంజాబ్ వైపు తిప్పేసాడు.

ఈ ఓవర్లో అర్షదీప్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా, రెండు పర్యాయాలు మిడిల్ స్టంప్ విరిగిపోయింది. తోలుత తిలక్ వర్మ (3)ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్షదీప్ ఆ తర్వాత బంతికి నిహాల్ వదెరాను తిప్పి పంపాడు. ఒక స్టంప్ విరిగింది అంటే ఏదోలే అనుకోవచ్చు… రెండోసారి కూడా స్టంప్ విరిగింది అంటే ఈ సర్దార్జీ వెరీ వెరీ స్పెషల్ అని తెలిసిపోతుంది. మొత్తానికి ఆ ఓవర్ లో అర్షదీప్ రెండు పరుగులే ఇచ్చారు. తనను ఎందుకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటారో చాటి చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version