కెనడాలో భారతీయుడి హత్య

-

కెనడాలో ఓ భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారత సంతతి వ్యక్తి యువరాజ్‌ గోయల్‌ (28) పై కొందరు దుండగులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. జూన్‌ 7వ తేదీన ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం.. యువరాజ్‌ది పంజాబ్‌లోని లుథియానా. ఉన్నత చదువుల నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవలే కెనడాలో శాశ్వత నివాస హోదా కూడా లభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందగా.. వారు అక్కడికి చేరుకొని యువరాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సర్రేకు చెందిన మన్వీర్‌ బస్రం (23), సాహిబ్‌ బస్రా (20), హర్‌కిరట్‌ ఝుట్టీ, ఒట్టారియోకి చెందిన కీలన్‌ ఫ్రాంకోయిస్‌(20)లను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version