కల్కి ట్రైలర్​లో దీపిక తెలుగు డబ్బింగ్​పై ట్రోల్స్

-

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ కల్కి 2898 ఏడీ. జూన్‌ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉందీ ప్రచార చిత్రం ట్రైలర్‌. చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ట్రైలర్​ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ మూవీ ట్రోల్​ అవుతోంది. అదే దీపిక పదుకొణె తెలుగు డబ్బింగ్. ఈ సినిమాలో యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దిశా పటానీ కూడా ఓన్ డబ్బింగే చెప్పుకున్నారు. అయితే దీపిక తెలుగు బాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మంది ట్రైలర్​లో దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే ఇది సినిమాకు మైనస్ అయ్యేలా ఉందే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version