నేడు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం

-

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జగన్నాథుడి రత్న భాండాగారం ఈరోజు (జులై 14వ తేదీ) తెరుచుకోనుంది. ఈ మేరకు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు.

ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? ఎవరు పాల్గొంటారు? భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు భాండాగారం తలుపులు తెరవడానికి ఎంత మంది వెళ్తారన్న దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రక్రియంతా పూర్తి చేయడానికి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈసారి వివరాల నమోదును డిజిటలైజేషన్‌ చేయిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version