న్యూ లుక్​లో అదిరిపోయిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన లుక్​ని మార్చారు. గత కొన్ని నెలలుగా నెరిసిన గడ్డం.. జుట్టుతో దర్శనమిస్తోన్న రాహుల్ తాజాగా స్టైలిష్​గా మారారు. న్యూ హెయిర్ కట్ చేయించుకుని.. గడ్డం కాస్త ట్రిమ్​ చేసుకుని పదహారేళ్ల యువకుడిలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంగ్లాండ్​లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లండన్​ వెళ్లిన రాహుల్ గాంధీ స్టైలిష్​ లుక్​లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

‘భారతదేశపు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీని మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా కేంబ్రిడ్జి బిజినెస్‌ జడ్జి బిజినెస్‌ స్కూల్‌ విజిటింగ్ ఫెలోగా ‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద 21st సెంచరీ’ అనే అంశంపై ప్రసంగం చేయనున్నారు’ అని కేంబ్రిడ్జి ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version