బాలీవుడ్ దీవా కియారా అడ్వాణీ పెళ్లి తర్వాత మొదటి సారిగా ఓ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొంది. ఈ ఈవెంట్లో కియారా లుక్ చూసి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. రెడ్ లాంగ్ ఫ్రాక్‌లో కియారా మెరిసిపోయింది. అవార్డు ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కియారా నిలిచింది.
థైస్ స్లిట్ గౌన్‌లో కియారా థైస్ సో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. మరోవైపు క్లీ వేజ్ షోతోనూ టెంప్ట్ చేసింది. రెడ్ ఔట్ఫిట్లో కియారా ప్రేమ దేవతలా కనిపించింది. ఈ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది కియారా. పెళ్లి తర్వాత దిల్లీ, ముంబయిలలో రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకలోనూ కియారా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయింది. మరోవైపు కియారా అటు బాలీవుడ్లో.. ఇటు టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే.