ఆ నాయకుడు మా అమ్మకు ఫోన్ చేసి బోరున ఏడ్చారు : రాహుల్ గాంధీ

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల బీజేపీలో చేరారు. వారిలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కూడా ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ చవాన్ చేరికను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజున ముంబయిలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో చవాన్ బీజేలో చేరడంపై రాహుల్ ఆసక్తిక కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్, ఇండియా కూటమి… కేంద్రంలో ఉన్న అధికారంతో పోరాడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. అందులో ఉన్న వ్యక్తులు ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తాను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదని చెబుతూనే.. మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారని చెప్పారు. అయితే అంతకుముందు ఆయన తన తల్లి సోనియా గాంధీతో మాట్లాడారని రాహుల్ చెప్పారు. తన తల్లికి ఫోన్ చేసి..‘సోనియాజీ.. వారితో పోరాడేందుకు నాకు శక్తి లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారని రాహుల్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version