పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. ప్రస్తుతం దేశం క్షిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలసికట్టుగా పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇందుకు గాను పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరారు రాహుల్ గాంధీ. కాగా, పాక్ తో యుద్ధం… ఇండియా నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని 87 ప్రదేశాల్లో 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేసింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రతను పెంచింది. మూసివేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో భద్రతను కల్పించిన తర్వాత ఆ ప్రాంతాలను ప్రభుత్వం తెరవనుంది.