ఈసీపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింద న్నారు రాహుల్ గాంధీ. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది.

అలాంటప్పుడు అం త తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ . ఇక అటు బిహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి ఓ అవకాశవాద కూటమి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నీతీశ్ కుమార్ సీఎం కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని.. ఆయన తరచూ కుర్చీలాట ఆడుతుంటారని విమర్శించారు. బిహార్‌లోని బక్సర్‌లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొన్న ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే సర్కారును అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.