ఏపీ,తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలు

-

ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక హైకోర్టుకు సైతం కొత్త జడ్జీలు వచ్చారు.మొత్తం ఏడుగురు న్యాయమూర్తులకు స్థానచలనం కలిగింది.ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాస్ హైకోర్టుకు.. జస్టిస్ పెరుగు శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు అయిన హేమంత్ చందన్ గౌడ్ మద్రాస్ హైకోర్టుకు, క్రిష్ణన్ నటరాజన్‌ను కేరళకు, సంజయ్ గౌడను గుజరాత్‌కు, దీక్షిత్ క్రిష్ణ శ్రీపాద్‌ను ఒరిస్సా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news