వెయిటింగ్ లిస్టు దెబ్బ.. 2.70కోట్ల రైలు ప్రయాణికులకు నిరాశ

-

దేశంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను రైల్వే శాఖ తీర్చేలేకపోతోంది. తాజాగా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ విషయం తేటెల్లమయింది. టికెట్ కొన్నా కూడా వెయిటింగ్ లిస్టు వల్ల కోట్ల మంది ప్రయాణికులు రైలు ప్రయాణానికి దూరమవుతున్నారు. ఒక్క 2022-2023 ఆర్థిక సంవత్సరంలోనే 2.70 కోట్ల మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది.

మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.76 కోట్ల మంది పేర్లు మాత్రమే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (పీఎన్ఆర్) నమోదయయ్యాని రైల్వే శాఖ వెల్లడించింది. వెయిట్‌లిస్ట్ కారణంగా మిగతా వారి పేర్లు ఆటోమేటిక్‌గా రద్దు అయినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రైళ్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇది ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ను తగ్గిస్తుందని పేర్కొంది. కొవిడ్కు ముందు 10,186 రైళ్లను నడిపామని.. కరోనా అనంతరం వాటిని 10,678కి పెంచినట్లు వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version