బ్రెజిల్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి

-

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా పై బ్రెజిల్ అధ్యక్షుడు ఇనాసియో లులా డా సిల్వా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తనకు ఎంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన కొనియాడారు. మూడు గంటల నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్ ఇది.. ఇందులోని అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు తనకు ఎంతగానో నచ్చాయన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు తెలిసిన వాళ్ళందరినీ మీరు ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించారా..? అని మొదట అడుగుతానని తెలిపారు.

అయితే బ్రెజిల్ అధ్యక్షుడి ప్రశంసల పట్ల తాజాగా స్పందించారు ఎస్ఎస్ రాజమౌళి. ” మా సినిమాపై మీరు చేసిన వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు సర్. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించారని, ఆర్ఆర్ఆర్ ని ఆస్వాదించారని తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ అభినందనలతో మా టీం ఎంతో సంతోషంగా ఉంది” అని ట్విట్ చేశారు జక్కన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version