రాజధాని ఎక్స్​ప్రెస్​కు తప్పిన పెను ప్రమాదం.. లోకోపైలట్ అప్రమత్తతో ప్రయాణికులు సేఫ్

-

ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి ముంచిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదాన్ని మరిచిపోకముందే ఒడిశాలోనే మరో రెెండు రైలు ప్రమాదాలు జరిగాయి. కానీ ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోచోట మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది.

ఝార్ఖండ్​లో ఓ రైలుకు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. రైల్వే క్రాసింగ్​ గేట్​ను దాటుతున్న ఓ ట్రాక్టర్​ను.. అదే సమయంలో వచ్చిన రాజధాని ఎక్స్​ప్రెస్​ ఢీ కొట్టింది. దూరం నుంచే ట్రాక్టర్​ను గమనించిన లోకోపైలట్​ వెంటనే అప్రమత్తమై సడెన్ ​బ్రేకులు వేశారు. లోకోపైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

బొకారో జిల్లాలోని భోజుడి స్టేషన్ సమీపంలో ఉన్న సంతాల్​దియా రైల్వే క్రాసింగ్​ వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలా వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version